KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆదివారం కరీంనగర్లోని ఆయన నివాసంలో చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బొక్కెన కృష్ణకుమార్ పాల్గొన్నారు.