BPT: మెదరమెట్ల గ్రామంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఈరోజు ఎస్సై మహమ్మద్ రఫీ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.