98వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగగా సాగింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గానూ షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా నిలవగా, ‘వెపన్స్’ చిత్రానికి ఎమీ మాడగన్ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. ‘కెపాప్ డెమన్ హంట్స్’ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. ‘సిన్నర్స్’ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు గెలుచుకుంది.