BHPL: కాటారం (M) కేంద్రంలోని LG గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. అందరూ కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.