వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. పగలు తగినంత నీరు తాగకపోవడం, రాత్రిపూట ఉప్పుగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అర్ధరాత్రి విపరీతంగా దాహం వేస్తుంది. దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనిని నివారించడానికి పగలు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. రాత్రి పడుకునే ముందు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉండి హాయిగా నిద్రపడుతుంది.