AP: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద మంగళగిరికి చెందిన క్రాంతి కిరణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆస్తులు కబ్జా అయ్యాయని ఆయన ఆరోపించగా, విచారణ చేపట్టిన అధికారులు ఆ ఆస్తులు ఆయన పేరునే ఉన్నాయని, కేవలం ఒక ఇల్లు కోర్టు వివాదంలో ఉందన్నారు. క్రాంతి కిరణ్ మానసిక స్థితి దృష్ట్యా చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.