TG: డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్‌లను పోలీసులు ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యంగా పోలీసులపై జరిగిన హత్యాయత్నాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.