TG: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమారులో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న రూ.21 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. పనుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు.