ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. గాఢ నిద్ర రావాలంటే రాత్రి 7 గంటలలోగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. ఏదైనా బుక్స్ చదివినా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు గ్లాసు పాలు తాగినా గాఢ నిద్ర పడుతుంది.