కోనసీమ: కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో కోటి రూపాయల పుష్కర నిధులతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి విగ్రహాలను బాలాలయంలోకి తరలించే కార్యక్రమం నిర్వహించారు.