ఇటీవలే ముగిసిన T20 WCలో టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై కోచ్ గంభీర్ స్పందిస్తూ.. ‘2014 IPLలో నేను ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు రన్స్ చేయలేదంటే అతని ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు’ అని అన్నాడు.