సాయిధరమ్ తేజ హీరోగా నటించిన బ్రో మూవీ ఈ రోజు రిలీజైంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. మామతో కలిసి నటించడం పట్ల సాయి ఎమోషనల్ అయ్యారు.
Sai Dharam TeJ Emotional Note: సాయి ధరమ్ తేజ (Sai Dharam TeJ) నటించిన బ్రో మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ క్రమంలో సాయి (sai) తన మామయ్య పవన్ కల్యాణ్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనతో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఉన్న తన చిన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఆ పిక్కు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అని క్యాప్షన్ ఇచ్చారు.
మామ పవన్ కల్యాణ్‌తో (pawan kalyan) నటించడంతో కల నెరవేరిందని సాయి తెలిపారు. తనలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని ఉందని.. తన గురువు మామయ్య అని.. స్ఫూర్తి అని రాసుకొచ్చారు. ఇన్నాళ్లకు మామతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చిందని అన్నారు. ఇప్పటికీ పవన్ చేయి పట్టుకున్న పిల్లాడినే అంటూ ఎమోషనల్ అయ్యారు.
తనపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప మూవీకి ఎంపిక చేసిన త్రివిక్రమ్‌కు (Trivikram) థాంక్స్ చెప్పారు. సముద్రఖని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, బ్రో మూవీ టీమ్ అందరికీ థాంక్స్ చెప్పారు. ముగ్గురు మామయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్.. వారి అభిమానులు, సినీ ప్రియులకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చూపించే ప్రేమాభిమానాలు మరచిపోను.. సినిమా మనందరిదీ.. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.