ATP: బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో నిర్వహించిన సుంకలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.