WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పౌర సరఫరాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, DRA రామారెడ్డి తదితరులు ఉన్నారు.