VSP: కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా కరకవలస-శిమిలిగుడ స్టేషన్ల మధ్య నిర్మించిన 9 కిలోమీటర్ల విద్యుదీకృత డబుల్ లైన్ను రైల్వే భద్రతా కమిషనర్ బృజేష్ కుమార్ మిశ్రా తనిఖీ చేశారు. స్పీడ్ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఈ మార్గంలో పూర్తి స్థాయి రైలు రాకపోకలకు అనుమతి లభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.