TG: BJP కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన ఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గ్రేటర్ విభజన, మూసీ ప్రాజెక్టుతో పాటు ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.