CTR: నగరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న నగరి ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు అర్హులు.