KDP: సిద్ధవటం మండలంలోని బాకరాపేట గ్రామం MPP స్కూల్ సమీపాన ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు మృతి చెందిన వ్యక్తిని కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. ఎవరైనా అతని ఆచూకీ తెలిసినవారు 9121100581,9121100584 మొబైల్ నెంబర్లకు సమాచారం తెలపాలని ఎస్సై హారిక తెలిపారు.