SDPT : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన వస్తూ సామాగ్రిని పంపిణీ చేశారు. చిన్నకోడూరు పీహెచ్ సీలో పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.