W.G: పెనుగొండ మండలం వడలి గ్రామ శివారు కొండలమ్మ పుంత రోడ్డు వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,550 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మండలంలో జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టడం జరిగిందన్నారు.