VZM: వైసీపీ కార్యక్రమాలను, సిద్ధాంతాలను విద్యార్థి, యువజన విభాగమే బాధ్యత తీసుకొని ప్రజలలోకి తీసుకువెళ్లాలని శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం తన స్వగృహంలో 50 డివిజన్ల యువజన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యారంగాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.