కోనసీమ: పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమని, భయాందోళనలు చెందకుండా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. పరీక్షలు బాగా రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.