NLG: వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.