VZM: నెల్లిమర్ల మండల పరిధిలో పౌర సరఫరాల శాఖాధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 13 గృహావసర సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై 6 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా, జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు.