ప్రధాని మోదీ (PM MODI) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మూడోసారి అధికారం ఇస్తే ప్రపంచంలో భారత్‌ను మూడో ఆర్థిక వ్యవస్థ(Economic system)గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. దీనిపై దేశ ప్రజలకు గ్యారెంటీ ఇస్తానని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. భారత్(India)లో పేదరికం అంతం కాబోతున్నదని అంతర్జాతీయ ఏజెన్సీలు చెబుతున్నాయని తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయాలతో దేశం సరైన దిశలో వెళ్తుందన్నారు.
బీజేపీ (BJP) మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. మూడోసారి గెలిచాక ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని, ఇది మోదీ ఇస్తున్న హామీ అని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదేళ్లలో తాము 40,000 కిలో మీటర్ల రైల్వే లైన్లను విద్యుద్ధీకరిస్తే, 60 ఏళ్లలో 20,000 కిలో మీటర్ల రైల్వే లైన్ ను మాత్రమే విద్యుద్ధీకరించారన్నారు. ఇప్పుడు ప్రతి నెల 6 కిలో మీటర్ల మెట్రో లైన్ (Metro line) ను పూర్తి చేస్తున్నామన్నారు. 4 లక్షల కిలో మీటర్ల మేర గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. విమానాశ్రయాల సంఖ్య 150కి చేరుకుందన్నారు.