AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. విశాఖ, అల్లూరి, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ వానలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.