NZB: ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పేట్ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదివారం సర్పంచ్ గణేష్, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామాభివృద్ధిలో సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం, ఇతర పనుల్లో అంకితభావంతో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించడం తమ బాధ్యతని సర్పంచ్ పేర్కొన్నారు.