NGKL: జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జై భీమ్ దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు మాన్యవర్ కాన్సిరాం జయంతి నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వరకు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. 12 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ దీక్షల ద్వారా బహుజన మహనీయుల ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర దళిత నేత వంకేశ్వరం నిరంజన్ తెలిపారు.