MBNR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డిని దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని అందులో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్నారు.