W.G: భీమవరం కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి పట్టణానికి చెందిన సరిపల్లి రామరాజు దంపతులు 8 గ్రాముల బంగారం ఆదివారం విరాళంగా అందజేశారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.