SRD : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామంలో జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్నారు. గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.