GDWL: పుల్లూరు టోల్ ప్లాజా వద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హైవే పక్కన ఉన్న హోటళ్లు దోపిడీ చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.