MBNR: బీజేపీ అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మంత్రి శ్రీహరి అన్నారు. ఢిల్లీ నిరసనలో పాల్గొన్న జడ్చర్ల నేత నరసింహ యాదవ్ నివాసానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వ వేధింపులను అడ్డుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.