TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. ఈనెల 20న ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నఅనేక వివాదాస్పద అంశాలపైనా ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది.