PLD: మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఛైర్మన్ షేక్ మదార్ సాహెబ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఎమ్మెల్యే జూలకంటి హాజరుకానున్నారు. పట్టణాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కౌన్సిలర్లు, అధికారులు అందరూ సమయానికి హాజరుకావాలని కమిషనర్ వేణుబాబు సూచించారు.