18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి ఓ యువ మహిళా క్రికెటర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
cricket: క్రీడాకారులు(Sportsmen) శారీకంగా, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి, దానికోసం ఎంత శ్రమించాలో మనకు తెలుసు. స్పోర్ట్స్ పర్సన్స్ అంటేనే ఫిట్ నెస్ కు మారుపేరు. సూర్యోదయానికి ముందునుంచి కసరత్తులు మొదలు పెట్టి చీకటి పడినా.. తమ లక్ష్యం కోసం శ్రమిస్తూనే ఉంటారు. అంతాలా కష్టపడేది దేశం తరుఫున ఆడేందుకే. అలాంటిది ఓ యువ క్రికెటర్ తన దేశం కోసం తన భవిష్యత్తును త్యాగం చేస్తుంది. 18 ఏళ్లకే రిటైర్మెంట్(Retirement at 18 years) ప్రకటించింది. ఈ వయసులో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది పాకిస్థాన్ యువ క్రికెటర్ ఆయేషా నసీమ్(Pakistani young cricketer Ayesha Naseem). ఏ యువ క్రికెటర్ అయినా 18 ఏళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలుపెడితే అది ఘనతగా భావిస్తామందరం. అలాంటిది ఇస్లాం మత నియమాలను అనుసరించి తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
అతి చిన్న వయస్సులో 15 ఏళ్లకే పాకిస్థాన్(Pakistan) తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆయేషా.. తనదైన శైలీలో రాణించి మంచి బ్యాటర్‌గా మంచి పేరు సంపాదించింది. అంతే కాకుండా అల్ రౌండర్ గా కూడా తనకు టీమ్‌లో మంచి పేరు ఉంది. ఈమె ప్రస్తుతం టీ20ల్లో ఆమె పాక్ కీలక బ్యాటర్లలో ఒకరు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ 30 టీ20ల్లో దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 369 పరుగులు చేసింది. ఆల్‌రౌండరైన ఆయేషా పేస్ బౌలింగ్ కూడా చేస్తుంది. క్రికెట్లో మంచి పట్టు సాధించిన ఆమె భవిష్యత్తులో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడుతుంది అనుకున్నారు అందరు. కానీ మత పరమైన కారణాలతో అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనుకోవడం పాక్ క్రికెట్ వర్గాలు సైతం షాక్ కి గురయ్యాయి. బోర్డు ప్రతినిధులతో పాటు కెప్టెన్ నిదాదర్ ఆమె మనసు మార్చడానికి ఎంత ప్రయత్నం చేసిన తాను క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికే నిశ్చయించుకుంది.