»Rains In Telangana Another Two Days July 23rd 2023
Telangana:లో మరో రెండు రోజులు వర్షాలు!
తెలంగాణ(telangana) వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సమస్యలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు పౌరులను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకో ఐదు రోజులు వర్షాలు(rains) కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలకు రెండ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబబాద్, హనుమకొండ, భువనగిరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులు వానలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌లో(hyderabad) వర్షాలు కురుస్తున్న వేళ ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే పౌరులు 040-2111 1111 లేదా 90001-13667 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వర్షాకాల సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. నీరు నిలిచిపోవడం, పడిపోయిన చెట్ల కొమ్మలు, పాక్షికంగా వరదలు సంబంధించిన సమస్యలను క్లియర్ చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సమస్య ప్రజలకు ఇబ్బందిగా మారింది.