KRNL: డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం సమీపంలో నందికొట్కూరు రహదారి నుంచి నంద్యాల రహదారికి అనుసంధానమైన బీటీ రహదారిని ఆయన పరిశీలించారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారిలో తుది దశ పనులు సక్రమంగా చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.