కోనసీమ: రాయవరంలో లారీ పైనుంచి ప్రమాదవ శాత్తు జారిపడి గుంటూరుకి చెందిన లారీ క్లీనర్ చింతల నరేష్ కుమార్ మృతి చెందాడు. శనివారం ధాన్యం లోడు అన్లోడ్ చేసే క్రమంలో తాడు విప్పుతుండగా పైనుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని స్థానికులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.