NGKL: కల్వకుర్తిలోని వీరన్నపల్లి గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని సర్పంచ్ రామలక్ష్మణ్ కోరారు. శనివారం ఎమ్మెల్యేను కలిసి బీటీ, సీసీ రోడ్ల కోసం రూ.10 లక్షలు కేటాయించాలని, అలాగే గ్రామంలో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ కేశవరెడ్డి, ఉపసర్పంచ్ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.