»Transfers Of 26 Deputy Commissioners In Greater Hyderabad
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో 26 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలువురు బదిలీ అయ్యారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వులిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. మరికొందరికి పోస్టింగ్ ఇస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మధ్యనే జిహెచ్ఎంసికి కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ వచ్చిన సంగతి తెలిసిందే. పలు అంశాలపై రివ్యూ నిర్వహించి ఆయన జిహెచ్ఎంసిలో డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా పలువురికి స్థానచలనం కలగగా, మరికొంతమందికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ల నుంచి రిలీవైన వారికి పోస్టింగ్స్ ఇచ్చారు.
బదిలీ అయిన అధికారులు వీళ్లే:
కాప్రా డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ బేగంపేట్ సర్కిల్ డీసీగా బదిలీ
బేగంపేట్ డీసీ ముకుంద్ రెడ్డి చందానగర్ డీసీగా బదిలీ
ఉప్పల్ డీసీ అరుణ కుమారి చరణ్ సరూర్ నగర్ డీసీగా బదిలీ
సరూర్ నగర్ డీసీ కృష్ణయ్య కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ గా బదిలీ
హయత్ నగర్ డీసీ మారుతి దివాకర్ అంబర్ పేట్ డీసీగా బదిలీ
అంబర్ పేట్ డీసీ వేణుగోపాల్ ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం
చార్మినార్ డీసీ సూర్యకుమార్ అల్వాల్ డీసీగా బదిలీ
అల్వాల్ డీసీ నాగమణిని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం
రాజేంద్రనగర్ డీసీ జగన్ మెహిదిపట్నం డీసీగా బదిలీ
మెహిదిపట్నం డీసీ MKI అలీని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం
కార్వాన్ డీసీ శ్రీనివాస్ కు ఉప్పల్ సర్కిల్ -2 డీసీ తో పాటు కాప్రా డీసీగా అదనపు బాధ్యతలు
జూబ్లీహిల్స్ డీసీ రజినికాంత్ రెడ్డి శేరిలింగంపల్లి డీసీ గా బదిలీ
యూసఫ్ గూడ డీసీ రమేష్ మూసాపేట్ డీసీగా బదిలీ
మూసాపేట్ డీసీ రవికుమార్ రాజేంద్రనగర్ డీసీగా బదిలీ
చందానగర్ డీసీ సుధాంశ్ సికింద్రాబాద్ డీసీగా బదిలీ
సికింద్రాబాద్ డీసీ దశరథ్ ఎల్ బీ నగర్ డీసీగా బదిలీ
ఆర్ సీ పురంఅండ్‌పటాన్ చెరు డీసీ బాలయ్య గోషామహల్ డీసీగా బదిలీ
గోషామహల్ డీసీ డాకు నాయక్ చార్మినార్ డీసీగా బదిలీ
కూకట్ పల్లి డీసీ రవీంద్ర కుమార్ హయత్ నగర్ డీసీగా బదిలీ
గాజులరామారం డీసీ ప్రశాంతి జూబ్లీహిల్స్ డీసీగా బదిలీ
శేరిలింగంపల్లి జాయింట్ కమిషనర్ మల్లయ్య గాజుల రామారం డీసీగా బదిలీ
ఆర్ సీ పురం అండ్ పటాన్ చెరు డీసీగా పోచారం మున్సిపాలిటీ కమిషనర్ పని చేసిన సురేష్ కు పోస్టింగ్
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన్ మహ్మద్ యూసఫ్ కు కార్వాన్ డీసీగా పోస్టింగ్
సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన చంద్రశేఖర్ కు యూసఫ్ గూడ డీసీగా పోస్టింగ్
నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన సత్యబాబుకు కుత్బుల్లాపూర్ డీసీగా పోస్టింగ్
కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారును తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అటాచ్