విజయనగరం, రాజారావు మేడ ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య సంఘం (కస్పా) భవనం పునర్నిర్మాణం కొరకు శనివారం శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిపారు. ముఖ్య అతిధులుగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కోలగట్ల శ్రావణి, కౌశిక్ దంపతులు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్యల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాసరావు పాల్గొన్నారు.