కడప: జిల్లా పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫీసర్పై దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిరను వెంటనే సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విధులు నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫీసర్ భూత లింగేశ్వరరావుపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆయన ఆరోపించారు.