AP: కృష్ణా జిల్లాలో ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్‌కు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అమెరికా వెళ్లే తెలుగువారికి జయరామ్ ఒక కేరాఫ్ అడ్రస్ అని, ఆయన నిరంతర కృషికి తగిన గుర్తింపు లభించిందని వారు కొనియాడారు.