Chandrayaan 3 rocket is flying.. A wonderful view from the sky
Chandrayaan 3: భారతదేశం గర్వించదగ్గ ఘట్టం చంద్రయాన్ 3(Chandrayaan 3) రాకెట్ లాంచింగ్ జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు అవిష్కృతం అయింది. ఇస్రో(ISRO) శాస్త్రవేత్తల సారథ్యంలో LVM3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ శ్రీహరికోట నుంచి నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు సైతం మన వైపు చూశాయి. ఇక చాలా మంది రాకెట్ లాంచింగ్‌కు సంబంధించిన వీడియోను రకరకాల మాధ్యమాలలో షేర్ చేశారు. అయితే తాజాగా చంద్రయాన్ 3 రాకెట్ ఆకాశంలో దూసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట సంచలనం రేపుతున్నాయి. నిన్న లాంచింగ్ అయిన తరువాత ఓ ప్రయాణికుడు విమానం నుంచి ఆ దృశ్యాన్ని తన మొబైల్లో బందించాడు. ఆ సమయంలో ఫ్లైట్ చెన్నై నుంచి ఢాకాకు వెళ్తుందని తెలిపాడు. ఇది చారిత్రక ఈవెంట్ అని పైలెట్ ప్రయాణికులకు అనౌన్స్ చేశారని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.