VZM: శృంగవరపుకోట మండలం వినాయక పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఇవాళ ఉదయం గ్రామస్థులు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేళా తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.