తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉండటం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రావణ్ కుమార్ (Dasoj Shravan Kumar) వాపోయారు. రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఫోన్ నెంబర్స్ ఆధారంగా డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్ కు, సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గం.12.15 నుండి రేవంత్ అనుచరులమంటూ కొంతమంది తనకు అదేపనిగా ఫోన్ చేశారని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, హెచ్చరికలు జారీ చేశారని ట్వీట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి మరో నయుమ్ లాగా వ్యవహారిస్తున్నాడని విమర్శించారు.
అభిమానుల పేరుతో రేవంత్ రెడ్డి భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ (Dandupalyam Batch) లా తయారు అయ్యిందన్నారు. ప్రజల కోసం వార్ చేయాల్సిన వార్ రూమ్ లో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.బీసీ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar)పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడానని చెప్పారు. తలసాని మీద కూడా గతంలో దాడి చేశావని, ఇప్పుడు తనపై కూడా దాడి చేస్తున్నావని వెల్లడించారు. ముఖ్యమంత్రిపై కూడా అనేక విమర్శలు చేస్తున్నావని తెలిపారు. రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రైతులకు 3 గంటలు కరెంట్ చాలు అని ఎలా మాట్లాడుతావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.