వైద్య రంగంలో అద్భుతం జరిగింది. ఇజ్రాయిల్(Israel) వైద్యులు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని చేశారు. యాక్సిడెంట్(Accident)లో తెగిపోయిన తలను వైద్యులు తిరిగి అతికించారు. శస్త్రచికిత్స(Operation) చేసి ఈ ఘనతను సాధించారు. సులేమాన్ హసన్(Sulemaan Hassan) అనే 12 ఏళ్ల బాలుడుకి ఇజ్రాయిల్ వైద్యులు ఈ ఆపరేషన్ చేసి సక్సెస్(success) అయ్యారు.
సైకిల్‌పై వెళ్తున్న సులేమాన్ హసన్(Sulemaan Hassan)ను కారు ఢీకొంది. ఈ ప్రమాదం(Accident)లో అతని పుర్రె నుంచి వెన్నెపూస వేరయ్యింది. అలాంటి స్థితిని ‘అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లొకేషన్’ అని వైద్యులు చెబుతారు. యాక్సిడెంట్ అయిన వెంటనే బాలుడిని హడాస్సా మెడికల్ సెంటర్‌కు విమానంలో తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. వైద్యుల ప్రకారం అతని మెడ నుంచి దాదాపుగా తల పూర్తిగా వేరైపోయింది.
వైద్యులు చేసిన అరుదైన శస్త్ర చికిత్సతో ఆ బాలుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. తాజాగా హసన్(Sulemaan Hassan) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతను పూర్తిగా కోలుకునేంత వరకూ మానిటర్ చేస్తూనే ఉంటామని వైద్యులు తెలిపారు. తమ ఒక్కగానొక్క కొడుకుని కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల కృషికి ప్రశంసలు దక్కుతున్నాయి.