సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.
WHO: ఈ మధ్య క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ వైరస్ మానవులకు సోకేలా పరిణామం చెందే అకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. దీనిని ఇంగ్లీష్ లో ఏవీయిన్ ఇన్ఫ్లుయెంజా అని వ్యవహరిస్తారు. ఈ వైరస్లు సాధారణంగా పక్షులను టార్గెట్ చేస్తాయి. బర్డ్ ఫ్లూ కూడా ఓ రకమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్యే. పక్షులకు వచ్చే ఈ వైరస్ ఇటీవల కాలంలో మామల్స్లోనూ(క్షీరదాలు) బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా, ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచఆరోగ్య సంస్థ(WHO) ఓ ప్రకటనలో తెలిపింది. మనుషులు, జంతువులకూ హానీ కలిగించే కొత్త తరహా వైరస్‌లూ పుట్టుకురావొచ్చని హెచ్చరించింది.
మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు H1N1, H2N2, H3N3 వైరస్ లు సోకుతాయి. కోళ్లకు H5N1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుంచి ఈ వైరస్ అంటే భయమే. 1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4 కోట్ల మంది మరణించారు. బర్ద్ ఫ్లూ కూడా అదే విధంగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 – 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి.