»Kerala Education Minister V Sivan Kuttys Convoy Hit An Ambulance Three People Were Seriously Injured In The Accident
Ambulance: ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన మంత్రి
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వయ్ ఘనటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ క్రమంలో అతను ఆపకుండా వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Kerala Education Minister V Sivan Kutty's convoy hit an ambulance. Three people were seriously injured in the accident
V Sivan Kutty: కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి కాన్వయ్ ఓ అంబులెన్స్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ వ్యాన్ కిందపడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొట్టారకరలోని పులుమన్ జంక్షన్ దగ్గర చోటు చేసుకుంది. ఈ ఆక్సిడెంట్ కు సంబంధించిన దృష్యాలు ట్రాఫిక్ భద్రత సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఒక పక్కనుంచి వస్తున్న అంబులెన్స్(ambulance) చూసుకోకుండా అటుగా వస్తున్న మంత్రి కాన్వయ్ ఢీ కొట్టింది. అలాగే కంట్రోల్ కానీ వాహనం ఎదురుగా వస్తున్న బైక్ మీదకు దూసుకెళ్లింది. గమనించిన బైక్ నడిపేవ్యక్తి తన వేగాన్ని అదుపుచేసుకున్నాడు ఫలితంగా పెద్ద ప్రమాదమే తప్పింది. అంతేకాదు ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పోలీసుకు కూడా తృటిలో ప్రాణహాని తప్పింది. కూడలిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుపై పల్టీ పడిన అంబులెన్స్ దూసుకొచ్చింది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా చాలా ఘోరం జరిగేది. ఘటన జరిగిన తరువాత కొద్దిసేపు అక్కడ ట్రాఫీక్ నిలిచిపోయినట్లు సమాచారం. కాన్వాయ్ దిగి మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయాడు. గాయపడిన వారిని పట్టించుకోకుండా వెళ్లాడని కొందరు అంటుంటే, వారిని పలకరించే వెళ్లాడు అని మరికొందరు చెబుతున్నారు.
కేరళ – విద్యా శాఖ మంత్రి శివన్ కుట్టి ఎస్కార్ట్ వాహనం ఢీకొని అంబులెన్స్ బోల్తా.. ఆపకుండా వెళ్లిపోయిన మంత్రి. అంబులెన్సులో ఉన్న ముగ్గురికి గాయాలు, అంబులెన్స్ డ్రైవర్ మీద కేసు పెట్టిన పోలీసులు.#Kerala#KeralaNewspic.twitter.com/E0pb0sHQNC